‘స్పిరిట్’లో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న స్పెషల్ సాంగ్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి పూర్తి హార్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ‘ఫౌజీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. కాగా, ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘స్పిరిట్’ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నాడు. అయితే, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని.. ఇది సినిమాకే హైలైట్‌గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సాలిడ్ ట్యూన్ కూడా కంపోజ్ చేశాడని తెలుస్తోంది. మొత్తానికి ‘స్పిరిట్’ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version