Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ.. డేట్ ఛేంజ్ అయ్యిందా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనే విధంగా ఉండటంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. గతంలో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంపై నిర్మాత దిల్ రాజు ఓ క్లారిటీ ఇచ్చాడు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే, ఆ తరువాత ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై మరెలాంటి క్లారిటీ కూడా రాలేదు. అయితే, తాజాగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు మరోసారి ఈ రిలీజ్ డేట్‌పై అప్డేట్ ఇచ్చారు.

‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. దీంతో ఇప్పుడు అభిమానుల్లో ఈ మూవీ రిలీజ్ డేట్‌పై సంధిగ్ధత నెలకొంది. అసలు ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తారా లేక 25న చేస్తారా అనే డౌట్ వారిలో నెలకొంది. ఒకవేళ ఈ మూవీ రిలీజ్ డేట్ మారిందా అంటూ వారు చర్చించుకుంటున్నారు. మరి ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version