‘స్పిరిట్’ : ప్రభాస్ క్యారెక్టర్ పై ప్రణయ్ రెడ్డి వంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో నిర్మించారు. డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అయిన సలార్ ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. అయితే మరోవైపు నాగ్ అశ్విన్ తో కల్కి 2898 ఏడి తో పాటు మారుతీ తో మరొక మూవీ చేస్తున్నారు ప్రభాస్.

అయితే ఇవి పూర్తి అయిన అనంతరం సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని ప్రభాస్ చేయనున్న సంగతి తెలిసిందే. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీ గురించి ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని, ఇక సందీప్ సినిమాల్లోని హీరో పాత్రల మాదిరిగా ఇది కూడా పవర్ఫుల్ గా అదిరిపోతుందని అన్నారు. ప్రస్తుతానికి తాను అది మాత్రమే చెప్పగలనని అన్నారు. మొత్తంగా అయితే తొలిసారిగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ ప్రారంభానికి ముందే అందరిలో మంచి హైప్ ఏర్పరిచిందని చెప్పాలి.

Exit mobile version