డాక్టర్.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీపేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే పేరు కొనసాగించాలి – నందమూరి రామకృష్ణ

Published on Sep 21, 2022 10:35 pm IST


తాజాగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న స్వర్గీయ ఎన్టీఆర్ గారి పేరు మీద కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మారుస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే టీడీపీ పార్టీ శ్రేణులతో పాటు పలు ఇతర పార్టీల నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తుండగా కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మీడియాతో మాట్లాడారు. 1986 లో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు స్థాపించిన మెడికల్ హెల్త్ యూనివర్సిటీనీ అప్పట్లో అందరు, అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వారి మద్దతు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

అలానే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆ యూనివర్సిటీ ని స్థాపించారు కాబట్టి ఎన్టీఆర్ అనే పదాన్ని సమకూర్చి దానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదున్న అభిమానం గౌరవంతో దానిని “డాక్టర్”.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి వైఎస్ జగన్ గారి నేతృత్వంలోని ప్రభుత్వం దాని పేరుని మార్చటం దురదృష్టకరం. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వెలుగెత్తి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లే. ఆయన అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్. కావున అటువంటి వారి పేరుని, డాక్టర్. ఎన్టీఆర్ CF మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివెర్సిటీగా కొనసాగించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలిపారు.

సంబంధిత సమాచారం :