లేడీ బాస్ ‘నీరా వాసుదేవ్’గా శ్రీ‌లీల‌ స్టైలిష్ ఎంట్రీ

లేడీ బాస్ ‘నీరా వాసుదేవ్’గా శ్రీ‌లీల‌ స్టైలిష్ ఎంట్రీ

Published on Jun 14, 2024 1:00 PM IST

హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తోంది. లేడీ బాస్ నీరా వాసుదేవ్ పాత్ర‌లో శ్రీ‌లీల స్టైలిష్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. శ్రీ‌లీల బ‌ర్త్ డే కానుక‌గా ఈ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఓ ప్రైవేట్ జెట్ నుంచి దిగిన శ్రీ‌లీల వెన్నెల కిషోర్ తో “జ్యోతి… సునామీలో టి సైలెంట్ ఉండాలి.. నా ముందు నువ్వు సైలెంట్ గా ఉండాలి..” అంటూ డైలాగ్ చెబుతుంది.

ఈ వీడియో ప్ర‌స్తుతం అభిమానుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను పూర్తి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాకు జివి.ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 20న క్రిస్మ‌స్ కానుక‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు