ఐపీఎల్ ట్రోఫీ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుని చివరి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే, ఈసారి టైటిల్ గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది SRH టీమ్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఈ జట్టు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. బలమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమవుతోంది.
SRH జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఈశాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ వంటి డేంజరల్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వారికి తోడుగా బౌలర్లలో మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనాద్కట్ వంటి వారు తమ బౌలింగ్‌తో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక అభినవ్ మనోహర్, వియాన్ ముల్డర్ తమ ఆల్‌రౌండ్ ట్యాలెంట్‌తో సత్తా చాటనున్నారు. మరి ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న SRH బలాలు, బలహీనతలు.. జట్టు కూర్పు మరియు విజయావకాశాలపై ఓ లుక్కేద్దాం.
బలాలు :
పటిష్టమైన పేస్ బౌలింగ్ విభాగం – షమీ, కమిన్స్, పటేల్ వంటి పేస్ బౌలర్లు ఉండటంతో SRH బౌలింగ్ విభాగం మరింత బలపడింది.
బలమైన బ్యాటింగ్ లైనప్ – ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి బ్యాట్స్‌మన్ జట్టును విజయతీరాలకు చేర్చగలరు.
వ్యూహాత్మకమైన కెప్టెన్సీ – ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఉండటంతో SRH వ్యూహాత్మకమైన ఎత్తులతో బలంగా కనిపిస్తుంది.
బలహీనతలు :
స్పిన్ విభాగం – జంపా, చాహర్ మంచి స్పిన్నర్లు ఉన్నప్పటికీ సరైన బ్యాకప్ లేకపోవడం.
మిడిల్-ఆర్డర్ స్థిరత్వం – క్లాసెన్, మనోహర్, నితీష్ లాంటి ఆటగాళ్లపై భారీగా ఆధారపడాల్సి ఉంటుంది.
2024 సీజన్‌తో పోల్చితే SRHలో మార్పులు :
బ్యాటింగ్ :
2024లో SRH జట్టు 277/3 స్కోర్ చేసి, IPL రికార్డు నెలకొల్పింది.
2025లో బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి ఇషాన్ కిషన్‌ను జట్టులోకి చేర్చుకున్నారు.
బౌలింగ్ :
గత సీజన్‌లో స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు.
ఈసారి పేస్ విభాగంలో అనుభవజ్ఞులను తీసుకోవడంతో ప్రభావం చూపే అవకాశం ఉంది.
IPL 2025లో SRH తొలి మ్యాచ్‌కి జట్టు కూర్పు ఇలా ఉండొచ్చు :
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
అభిషేక్ శర్మ
ట్రావిస్ హెడ్
హెన్రిచ్ క్లాసెన్
అభినవ్ మనోహర్
నితీష్ కుమార్ రెడ్డి
హర్షల్ పటేల్
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్)
మహ్మద్ షమీ
ఆడమ్ జంపా
జయదేవ్ ఉనద్కట్
IPL 2025 టైటిల్ గెలిచే అవకాశాలు :
SRH ప్లేఆఫ్స్ చేరే అవకాశం 90 శాతంగా ఉంది.
SRH ఫైనల్ చేరే అవకాశం 60 శాతంగా ఉంది.
SRH టైటిల్ గెలిచే అవకాశం 50 శాతంగా ఉంది.
ఓవరాల్‌గా 2025 సీజన్‌లో SRH బలమైన జట్టుగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బ్యాలెన్స్ ప్లేయర్లతో SRH ఈసారి IPL ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.