IPL 2025 : పంజాబ్ కింగ్స్‌ను ‘షేక్’ చేసిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచిన పంజాబ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య(36), ప్రభ్‌సిమ్రన్ సింగ్(42) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(82)తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నేహల్ వధేరా(27), మార్కస్ స్టోయినిస్(34 నాటౌట్)తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పంజాబ్ కింగ్స్ 245 భారీ స్కోరు సాధించింది.

ఇక 246 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్(66), అభిషేక్ శర్మ(141) పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికారేశారు. కేవలం 55 బంతుల్లో 141 పరుగుల భారీ స్కోరు చేసిన అభిషేక్ శర్మ పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. తొలి వికెట్‌కు 171 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలగొల్పిన సన్‌రైజర్స్‌కు క్లాసెన్(21 నాటౌట్)తో విజయాన్ని అందించాడు. 9 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ 247 పరుగుల చేసి విజయాన్ని అందుకుంది.

Exit mobile version