’రాయుడు’ సినిమాకి డబ్బింగ్ చెపుతున్న శ్రీదివ్య..!

’రాయుడు’ సినిమాకి డబ్బింగ్ చెపుతున్న శ్రీదివ్య..!

Published on May 9, 2016 5:16 PM IST

Sri-Divya
తెలుగు అమ్మాయి అయినా తమిళ్ లో హీరోయిన్ గా మంచి పేరు పొందింది శ్రీ దివ్య. విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య కథానాయికగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ్ చిత్రం ’మరుదు’ ని తెలుగులో ‘రాయుడు’ గా తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ కి హీరోయిన్ శ్రీ దివ్య డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం.

ఇటీవల విడుదల చేసిన ‘రాయుడు’ ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. విశాల్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా మే 11న ఈ చిత్రం పాటలను విడుదల చేసి మే 20న చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పస్తుతం శ్రీ దివ్య జి.వి. ప్రకాష్ కుమార్ తో పెన్సిల్ అనే సినిమాలోనూ, కార్తీ తో కాష్మోరా అనే సినిమాలోనూ నటిస్తున్నది.

తాజా వార్తలు