శ్రీదేవి భారీ షాపింగ్


నిన్నటితరం సుప్రసిద్ధ నటి శ్రీదేవి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కోలాహలం సృష్టించబోతోంది. ప్రస్తుతం ఆమె న్యూ యార్క్ లో చిత్రీకరింపబడుతోన్న గౌరీ షిండే ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ చిత్ర షూటింగ్ లో నిమగ్నమయ్యారు. షూటింగ్ ప్యాకప్ చెప్పాక శ్రీదేవి షాపింగ్ లో చాలా బిజీ గా ఉంటున్నారు.

పీర్ 17, డైమండ్ డిస్ట్రిక్ట్, ఇంకా ప్రముఖమైన సన్ రైజ్ షాపింగ్ మాల్ తదితర చోట్ల శ్రీదేవి షాపింగ్ చేస్తుందట. అయితే ఎక్కువ సమయాన్ని శ్రీదేవి మస్సాపేక్యువ షాపింగ్ మాల్ లోనే వెచ్చిస్తుందని తెలిసింది. ఈ మాల్ లో 42 డిజైనర్ బ్రాండ్లు కు పైగా లభ్యమవుతాయి. శ్రీ దేవి కొంటున్న వాటిలో షూస్, డ్రేసేస్ ప్రధానంగా ఉన్నాయి. ఆమె కూతురి కోసం వివిధ ఐటమ్స్ కూడా శ్రీ కొంటుందట. ఆమె కొనుగోలు చేసిన వస్తువులు తిరిగి హోటల్ కు తీసుకెళ్లేందుకు ప్రత్యీకంగా సిబ్బందిని సైతం నియమించుకుందట. ఆమె షాపింగ్ అందరినీ అబ్బుర పరిచే విధంగా ఉందని సమాచారం.

Exit mobile version