క్రైమ్ సస్పెన్స్‌కు కామెడీ జోడించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ట్రైలర్

క్రైమ్ సస్పెన్స్‌కు కామెడీ జోడించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ట్రైలర్

Published on Dec 16, 2024 7:27 PM IST

టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్స్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ జోనర్‌లో వచ్చిన డిటెక్టివ్ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కట్టారు. ఇక ఇప్పుడు ఇదే కోవలో మరో క్రైమ్ సస్పెన్స్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈసారి సస్పెన్స్‌తో పాటు కామెడీని కూడా మిక్స్ చేసి మనముందుకు వస్తున్నాడు ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.

కమెడియన్ నుండి హీరోగా మారిన వెన్నెల కిషోర్ ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రైటర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కట్ పూర్తి సస్పెన్స్, థ్రిల్లింగ్, కామెడీ అంశాలతో సినిమాపై ఆసక్తి క్రియేట్ చేస్తోంది. వరుసగా జరుగుతున్న హత్యలకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ఓ డిటెక్టివ్ సాయం తీసుకోవడం.. ఆ డిటెక్టివ్ తన తెలివితో అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులను ఎలా తనదైన కామెడీతో విచారిస్తాడనేది మనకు ఈ సినిమా కథగా చూపెట్టబోతున్నారు.

ఇక డిటెక్టివ్ పాత్రలో వెన్నెల కిషోర్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని.. శ్రీకాకుళం యాసలో ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉండటం విశేషం. ఈ సినిమాలో అనన్య నాగళ్ల, శియా గౌతమ్, రవితేజ మహా దాస్యం, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు