ఇటీవల టాలీవుడ్‌లో రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఈ జాబితాలో రీసెంట్‌గా క్లాసిక్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ-రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ చిత్రం రీ-రిలీజ్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ఓ యంగ్ హీరో శ్రీకాంత్ అడ్డాల దగ్గర ఏదైనా మంచి కథ ఉంటే చెప్పాలని కోరాడట. ప్రస్తుతం ఈ టాపిక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఏదైనా కథ ఉంటే చెప్పాలంటూ ఆ యంగ్ హీరో శ్రీకాంత్ అడ్డాల ను కోరాడట. దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.