శ్రీకాంత్ అడ్డాల మళ్లీ వరుణ్ తేజ్ తో ?

శ్రీకాంత్ అడ్డాల మళ్లీ వరుణ్ తేజ్ తో ?

Published on Oct 18, 2019 1:34 PM IST

ఇండస్ట్రీలో హిట్ ఉన్నవాళ్ళకే డిమాండ్. అదే ఒక సినిమా పరాజయం పాలైతే, ఇక ఆ సినిమా దర్శకుడు ఎంత టాలెంటెడ్ అయినా సరే, తొందరగా అతనికి అంత తేలిగ్గా అవకాశాలు రావు. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలను తీశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ టాలెంటెడ్ దర్శకుడికి మంచి ఫ్యామిలీ చిత్రాలు తీస్తాడనే మంచి పేరు ఉన్నా.. బ్రహ్మోత్సవం ప్లాప్ తరువాత శ్రీకాంత్ కి మాత్రం మరో సినిమా మొదలుపెట్టడానికి మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ మధ్య శ్రీకాంత్ అడ్డాల నానితో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.

కానీ అవి ఫేక్ అని నానినే సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇంతకీ శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎప్పుడు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల త్వరలోనే సినిమాని పట్టాలెక్కించడానికి ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. వరుణ్ తేజ్ తో సినిమా ఉండొచ్చు అని ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు