లాస్ట్ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న ‘శ్రీమంతుడు’

లాస్ట్ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న ‘శ్రీమంతుడు’

Published on Jun 16, 2015 6:25 PM IST

mahesh-sri
న్యూ లుక్ మరియు న్యూ డైలాగ్ మాడ్యులేషన్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. మే 31న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని చివరి సాంగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్లో షూట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సాంగ్ షూట్ తో దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

సాంగ్ షూట్ తర్వాత మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ సీన్స్ ని రెండు మూడు రోజుల్లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తికాగానే మహేష్ బాబు కూడా తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని మొదలు పెట్టనున్నాడు. అనుకున్న తేదీ జూలై 17న రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం కంటిన్యూగా వర్క్ చేస్తోంది. మహేష్ బాబు సరసన మొదటి సారి హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో జూన్ చివరి వారంలో ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు