‘లక్కీ భాస్కర్’ నుండి ‘శ్రీమతి గారు’ వీడియో సాంగ్ రిలీజ్!

‘లక్కీ భాస్కర్’ నుండి ‘శ్రీమతి గారు’ వీడియో సాంగ్ రిలీజ్!

Published on Oct 15, 2024 5:06 PM IST

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. సక్సెస్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, లిరికల్ సాంగ్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

అయితే, తాజాగా ఈ సినిమా నుండి ‘శ్రీమతి గారు’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. చక్కటి లిరిక్స్, వినసొంపుగా ఉన్న మ్యూజిక్ బీట్స్‌తో ఈ పాటను చిత్రీకరించిన తీరు ప్రేక్షకులకు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతోంది. జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ పాటను నెక్స్ట్ ప్యూర్ మెలోడిగా నిలిచేలా చేసింది.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు