మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ లభించింది.
అయితే, ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాలోని ‘శ్రీమతి గారు’ అనే వీడియో సాంగ్‌ని అక్టోబర్ 15న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో దుల్కర్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఆయన భార్యగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.
వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవోతంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.