HIT3: ‘హిట్-3’లో కేజీయఫ్ బ్యూటీ ఎంట్రీ.. జోడీ అదిరింది!

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘హిట్-3’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, ప్రేక్షకుల్లో ఈ సీక్వెల్ మూవీపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వచ్చిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్లుగా నిలిచాయి.

దీంతో ఇప్పుడు హిట్-3 ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో ‘కేజీయఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడమే కాకుండా, ఆమెకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

నాని, శ్రీనిధి శెట్టిల జోడీ సూపర్‌గా ఉంటుందని అభిమానులు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రాన్ని 2025 మే 1న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Exit mobile version