మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో బ్రూస్‌లీ పేరుతో ఓ భారీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై అంతటా విపరీతమైన అంచనాలున్నాయి. చాలా ప్రత్యేకతలతోనే తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేయడమనేది సెన్సేషన్‌గా మారిపోయింది. చిరంజీవి నటించే 150వ సినిమా బ్రూస్‌లీయే కానుండడంతో అభిమానులు ఈ సినిమాలో చిరు ఎలా కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా దర్శకుడు శ్రీనువైట్ల మాత్రం చిరు లుక్ చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ ఎదురుచూడాలనే సంకేతాలిస్తున్నారు. చిరంజీవి-రామ్ చరణ్ కాంబోను డైరెక్ట్ చేయడాన్ని అదృష్టంగా తెలిపిన శ్రీనువైట్ల, చిరు పార్ట్ సినిమాకు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తుందని తెలిపారు. ఇక అక్టోబర్ 2న ఈ సినిమా ఆడియోను విడుదల కానుండగా, అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.