వరుస సినిమాలతో దూసుకు పోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీరామ్ నిమ్మల!

వరుస సినిమాలతో దూసుకు పోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీరామ్ నిమ్మల!

Published on Oct 30, 2022 10:26 AM IST


హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీరామ్ నిమ్మల కి సినిమా అంటే పిచ్చి. రెబెల్ స్టార్ ప్రభాస్ కి వీరాభిమాని, తన సినిమాలు చూసి సినిమా మీద పిచ్చి ప్రేమతో ఇండస్ట్రీ కి వచ్చాడు. కానీ, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రయత్నాలు చేయగా 2020 లో ఉత్తర చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. సినిమా విడుదలై శ్రీరామ్ నిమ్మల కి మంచి పేరు తెచ్చి పెట్టింది. తర్వాత 2022 లో శ్రీరామ్ నిమ్మల హీరో గా నటించిన సాఫ్టువేర్ బ్లూస్ మరియు రుద్రవీణ చిత్రాలు విడుదల అయ్యాయి. రుద్రవీణ చిత్రం శ్రీరామ్ నిమ్మల కి మాస్ హీరోగా పేరు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు మది అనే చిత్రం నవంబర్ 11న విడుదల కు సిద్ధం గా ఉంది. సాఫ్ట్ వేర్ బ్లూస్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, రుద్రవీణ లో ఒక కమర్షియల్ ఊర మాస్ పాత్ర చేశాడు. ఇప్పుడు మది చిత్రం లో టీనేజ్ కుర్రాడు నుంచి పరిపక్వత చెందిన ఒక బలమైన పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతానికి తురుమ్ ఖానులు అనే సినిమాలో ఒక పల్లెటూరి లో జరిగే మాస్ కామెడీ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో ఓటిటి లో విడుదల అవుతుంది. మరొక చిత్రం అనుకున్నవన్నీ జరగవు కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ఈ చిత్రాన్ని భారీ ప్రమోషన్స్ తో త్వరలో విడుదల చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు