నేటి నుండి ఓటిటి లో అందుబాటులోకి వచ్చిన ‘అల్లూరి’


విలక్షణ నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రదీప్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ అల్లూరి. ఈ మూవీలో నీతి, నిజాయితీకి మారుపేరైన పోలీస్ అధికారి పాత్రలో శ్రీవిష్ణు తన అత్యద్భుత నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తనికెళ్ళ భరణి, మధుసూధనరావు, ప్రమోదిని వంటి వారు కీలక పాత్రలు చేయగా బెక్కెం వేణుగోపాల్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కాగా ఈ మూవీ అక్టోబర్ 7 రాత్రి 8 గం. ల నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. అన్ని వర్గాల ఆడియన్స్ అలరించేలా తెరకెక్కిన అల్లూరి తప్పకుండా ఓటిటి ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

Exit mobile version