సెన్సార్ పూర్తి చేసుకున్న షారుఖ్ ఖాన్ “డంకీ”

సెన్సార్ పూర్తి చేసుకున్న షారుఖ్ ఖాన్ “డంకీ”

Published on Dec 15, 2023 11:00 PM IST


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మరియు మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజ్‌కుమార్ హిరానీ మొదటిసారిగా డంకీ కోసం చేతులు కలిపారు. బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్, పఠాన్ మరియు జవాన్‌లతో SRK ఈ సంవత్సరం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. కామెడీ మరియు ఎమోషన్స్ మిక్స్‌తో విలక్షణమైన రాజ్‌కుమార్ హిరానీ స్టైల్‌లో సినిమా ఉంటుందని ట్రైలర్ ద్వారా అర్దం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది మరియు CBFC ద్వారా U/A సర్టిఫికేట్ పొందింది.

చిత్రం యొక్క రన్‌టైమ్ 161 నిమిషాలు (2 గంటల 41 నిమిషాలు). ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశంలో, అడ్వాన్స్‌లు రేపటి నుండి ప్రారంభమవుతాయి. పఠాన్, జవాన్ లాగా ఈ చిత్రం ఇతర భాషల్లోకి డబ్ కావడం లేదు. తాప్సీ కథానాయికగా నటించింది. విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ మరియు జ్యోతి దేశ్‌పాండే జియో స్టూడియోస్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు