“కల్కి” చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది – రాజమౌళి

“కల్కి” చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది – రాజమౌళి

Published on Jun 27, 2024 6:30 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. తొలి షో నుండే సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ను చూసిన జక్కన్న రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కల్కి2898AD యొక్క ప్రపంచ నిర్మాణం చాలా బాగా నచ్చింది. దాని అద్భుతమైన సెట్టింగ్‌లతో ఇది నన్ను వివిధ రంగాలలోకి నన్ను తీసుకెళ్ళింది. డార్లింగ్ తన టైమింగ్ మరియు సౌలభ్యంతో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అమితాబ్ జీ, కమల్ సర్ మరియు దీపిక నుండి గొప్ప మద్దతు లభించింది. సినిమా చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. దానిని అమలు చేయడంలో వారి అసమాన ప్రయత్నాలకు నాగి మరియు మొత్తం వైజయంతి టీమ్‌కు అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. ఈ చిత్రం లో రాజమౌళి గెస్ట్ రోల్ లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు