మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను జనవరి 2న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా, జనవరి 2న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీంతో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌పై హైప్ మరింతగా పెరిగిపోయింది.
ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.