రాజమౌళికి నెట్ ఫ్లిక్స్ పై ఎందుకంత ప్రేమ ?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ రాక కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే, ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో తాజాగా రాజమౌళి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రాజమౌళి ఏమి మాట్లాడాడు అంటే.. ఆయన మాటల్లోనే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హిందీ వెర్షన్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంటే, ఇతర భాషల్లో రైట్స్ ను మాత్రం ‘జీ-5’, ‘డిస్నీ+హాట్ స్టార్’ సొంతం చేసుకున్నాయి.

కానీ, మిగిలిన నాలుగు భాషల ఆర్ఆర్ఆర్ రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ నే తీసుకొని ఉండుంటే బాగుండేది అంటూ రాజమౌళి కామెంట్స్ చేశాడు. మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పై రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ను బట్టి.. ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తపరిచాడు. కానీ.. రాజమౌళి మాటల్లోని అర్థాన్ని బట్టి.. ఆయనకు నెట్ ఫ్లిక్స్ పై ఉన్న నమ్మకం, అభిమానం ఏమిటో తెలుస్తోంది. అందుకే, రాజమౌళికి నెట్ ఫ్లిక్స్ పై ఎందుకు అంత ప్రేమ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version