Pushpa 2: ‘పుష్ప-2’ సెట్స్ నుండి ఐకానిక్ పిక్చర్ వదిలిన సుకుమార్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ముగించుకుంటున్న ‘పుష్ప-2’ సెట్స్ నుండి దర్శకుడు సుకుమార్ ఓ ఐకానిక్ పిక్చర్‌ని వదిలాడు. ‘పుష్ప-2’ సెట్స్‌లో ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి సందడి చేశాడు. దీంతో ‘పుష్ప-2’ చిత్ర టీమ్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. సుకుమార్ అండ్ టీమ్ రాజమౌళితో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇలా బిగ్గెస్ట్ మాస్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమా ‘పుష్ప-2’ సెట్స్‌లో బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్ సందడి చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘పుష్ప-2’ చిత్రాన్ని డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version