SSMB 28 నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 28 మూవీ ప్రస్తుతం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

మంచి మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న SSMB 28 యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న మహేష్ బాబు మరొక రెండు రోజుల్లో హైదరాబాద్ తిరిగిరానున్నారట. మరోవైపు ఈ మూవీ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అతి పెద్ద ఇంటి సెట్టింగ్ రూపకల్పన జరుగుతోంది. కాగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 11న విడుదల చేయనున్నారు మేకర్స్.

Exit mobile version