SSMB 29: దాదాపు ఆ పవర్ఫుల్ టైటిల్ తోనే

SSMB 29: దాదాపు ఆ పవర్ఫుల్ టైటిల్ తోనే

Published on Aug 25, 2024 6:38 PM IST


ప్రస్తుతం ప్రపంచమే ఎదురు చూస్తున్న తెలుగు సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ కోసమే అని చెప్పాలి. రాజమౌళి గ్లోబల్ ఫేమ్ తెచ్చుకోక ముందే గ్లోబల్ లెవెల్ బడ్జెట్ తో అనుకున్న ఈ సినిమా కోసం ఇప్పుడిప్పుడే మరిన్ని ఆసక్తికర నిజాలు బయటకి వినిపిస్తున్నాయి. అలా ఈ భారీ సినిమా ఇపుడు కాదు ఎప్పుడో మహేష్ తో అనుకున్న సినిమా అని టాక్ ఓ రేంజ్ లో వినిపిస్తుండగా ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ పై స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

రాజమౌళి (SS Rajamouli) అప్పట్లో అనుకున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గరుడ” గానే ఈ సినిమా రాబోతుంది అని టైటిల్ కూడా ఏ మార్పు లేదని అదే టైటిల్ తో అనౌన్స్ చేస్తారని ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇలా మొత్తానికి అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఆసక్తికర అంశాలే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ ప్రకారమే ఈ చిత్రం 2028 లో రిలీజ్ అని అంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేస్తుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు