లేటెస్ట్ : SSMB28 నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్ … !

Published on Sep 22, 2022 12:02 am IST

Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ SSMB28 మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

హై ఆక్టేన్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల గ్రాండ్ లెవెల్లో ప్రారంభం అవ్వగా, నేటితో ఈ షెడ్యూల్ పూర్తి అయిందని, యువ ఫైట్ మాస్టర్స్ అన్బరివు నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాం అని, దసరా అనంతరం సెకండ్ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్, పూజా హెగ్డే పాల్గొంటారని మూవీ టీమ్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :