రీమేక్ తో రాబోతున్న స్టార్ హీరో?

రీమేక్ తో రాబోతున్న స్టార్ హీరో?

Published on Jun 30, 2024 7:05 AM IST

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఆడియెన్స్ అయితే రీమేక్స్ పట్ల అంత ఆసక్తి చూపించడం లేదు. చాలా వరకు ఓ సినిమా రీమేక్ అంటే అది ఎలాంటిది అనేది కూడా ఆలోచించకుండా ఆగిపోతున్నారు. దీనికి కారణం ఓటీటీ కాగా వీటిలో కంటెంట్ దాదాపుగా అందరూ చూస్తున్నారు. సో ఇలా ఇప్పుడు రీమేక్స్ కి పెద్దగా డిమాండ్ లేదు.

అయితే చాలా తక్కువ తెలిసిన సినిమాలు అయితే వర్కవుట్ అవ్వొచ్చని కొందరు అనుకుంటున్నారు. అలా స్టార్ హీరో అజిత్ ఇప్పుడు రీమేక్ తోనే రాబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ రెండు సినిమాలు చేస్తుండగా వీటిలో దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తో చేస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమా రీమేక్ అన్నట్లు వినిపిస్తోంది.

ఈ చిత్రం ఓ హాలీవుడ్ చిత్రం “ది గ్యాంగ్ స్టర్ ది కాప్ ది డెవిల్” అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని టాక్. మరి ఈ టైటిల్ కి తగ్గట్టుగానే అజిత్ పై కూడా మూడు షేడ్స్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. మరి సినిమా దానికే రీమేక్ గా చేస్తున్నారా లేదా అనేది మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు