కమల్ సినిమాలో మరోక స్టార్ హీరో..? అద్దిరిపోయే బ్యాడ్ డ్రాప్లో సినిమా

Published on Sep 18, 2020 9:18 pm IST

విశ్వనటుడు కమల్ హాసన్ తన తర్వాతి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. లోకేష్ గత చిత్రం ‘ఖైదీ’ సూపర్ హిట్ కావడంతో ఆయనకు స్టార్ హీరో విజయ్ అవకాశం ఇచ్చారు. వీరు చేసిన ‘మాస్టర్’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ‘ఖైదీ’ విజయం తర్వాత కమల్ సైతం లోకేష్ డైరెక్షన్లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. సుధీర్ఘమైన చర్చల తర్వాత నిన్ననే వీరి ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ‘వన్స్ అపాన్ ఏ టైమ్ థెర్ లివ్డ్ ఏ ఘోస్ట్’ క్యాప్షన్ తో పోస్టర్ రూపొందించి ప్రాజెక్ట్ ప్రకటించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఇంత హెవీ క్యాప్షన్ ఇచ్చారంటే సినిమా నేపథ్యం కూడ హెవీగానే ఉండాలి.. మరి ఆ కథానేపథ్యం ఏమై ఉంటుంది అని అందరూ ఆరా తీస్తున్నారు. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రాజకీయ నేపథ్యం అంటే పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో కమల్ తో పాటు ఇంకో స్టార్ హీరో నటించనున్నాడట. ఆయన మరెవరో కాదు.. విజయ్ సేతుపతి. చిత్రంలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇది పూర్తవగానే లోకేష్ తెలుగులో ఒక డైరెక్ట్ సినిమా చేసే అవకాశముంది.

సంబంధిత సమాచారం :

More