టాలీవుడ్ లో భారీ సినిమాల దర్శకుడుగా మొదటి నుండి ఆడియన్స్ లో తనకంటూ మంచి పేరు దక్కించుకున్నారు గుణశేఖర్. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారితో వర్క్ చేసిన గుణశేఖర్ ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో రూపొందిన శాకుంతలం మూవీని తెరకెక్కించారు. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ భారీ మైథలాజికల్ జానర్ పాన్ ఇండియన్ మూవీకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ దీనిని భారీ వ్యయంతో నిర్మించారు. ఏప్రిల్ 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.
తాజాగా ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా గుణశేఖర్ మాట్లాడుతూ, ఇటీవల అనుష్క ప్రధాన పాత్రలో తాను తెరకెక్కించిన రుద్రమదేవి మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. అడిగిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని, అదే విధంగా ఇతర టాలీవుడ్ హీరోలు కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి అటువంటి ప్రాధాన్యత కలిగిన చిన్న పాత్రలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక శాకుంతలం లో సమంత శకుంతల పాత్రకి జీవం పోశారని, ఎల్లుండి మీ అందరి ముందుకి పలు భాషల్లో రిలీజ్ కానున్న మా మూవీ తప్పకుండా ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.