‘సర్కారువారి పాట, పుష్ప’ శాటిలైట్ హక్కులు ఆ ఛానెల్ చేతికే

Published on Oct 28, 2020 2:00 am IST


ప్రస్తుతం టాలీవుడ్లో రూపొందుతున్న పెద్ద సినిమాల్లో మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప’ కూడ ఉన్నాయి. ఈ సినిమాల మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. హీరోల గత చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్లు కావడంతో ఈ సినిమాలపై క్రేజ్ విపరీతంగా ఏర్పడింది. కేవలం ప్రేక్షకుల్లోనే కాదు బిజినెస్ వర్గాల్లో కూడ ఈ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్, ఆడియో రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొంది.

తాజా సమాచారం మేరకు ఈ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయని, రెంటి హక్కులనూ స్టార్ మా ఛానెల్ దక్కించుకుందని తెలుస్తోంది. గతంలో కూడ స్టార్ మా పలు పెద్ద సినిమాల హక్కులను కొని మంచి లాభాలనే ఆర్జించింది. అయితే ఈ హక్కులు ఎంతకు అమ్ముడయ్యాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీటిలో మహేష్ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తుండగా, అల్లు అర్జున్ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండూ కూడ వచ్చే ఏడాది విడుదలకానున్నాయి.

సంబంధిత సమాచారం :

More