SSMB29 కోసం స్టార్ టెక్నీషియన్

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కెరీర్‌లోని 29వ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం మహేశ్ ఓ సరికొత్త మేకోవర్ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా గురించి చర్చ సాగుతోంది. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఇదే అఫీషియల్ వర్కింగ్ టైటిల్‌గా మారింది. అంతేగాక, ఈ సినిమాను గ్లోబల్ ఫీచరెట్‌గా చిత్ర యూనిట్ మలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం స్టార్ టెక్నీషియన్ రంగంలోకి దిగుతున్నారు.

స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఓ పేపర్ ఆర్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్రముఖ విజువల్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ టిపి.విజయన్ ఈ మేరకు పేపర్ ఆర్ట్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగిపోయింది.

Exit mobile version