ఓటిటిలో ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన “స్త్రీ 2”

ఓటిటిలో ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన “స్త్రీ 2”

Published on Oct 10, 2024 8:09 AM IST


ఈ ఏడాదిలో బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో నటి శ్రద్ధా కపూర్ అలాగే రాజ్ కుమార్ రావు కాంబినేషన్ లో దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ క్రేజీ హారర్ కామెడీ థ్రిల్లర్ బాలీవుడ్ లో రికార్డ్స్ తిరగరాసింది. మరి ఈ చిత్రం దాదాపు 8 వారాల రన్ తర్వాతే ఓటిటిలోకి వచ్చింది. అయితే మొదటిగా మేకర్స్ ఈ చిత్రాన్ని రెంటల్ గా స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. అయితే ఇలా కాకుండా ఫ్రీ స్ట్రీమింగ్ కోసం ఇప్పుడు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారు.

అయితే ఫైనల్ గా నేడు ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి హక్కులని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నేటి నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, టాలెంటెడ్ యువ నటుడు అభిషేక్ బెనర్జీ తదితరులు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు