ఒక చిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ స్త్రీ, 2018 లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హార్రర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో, మేకర్స్ స్త్రీ – 2 అంటూ సీక్వెల్ ను తెరకెక్కించారు. ఆగస్టు 15 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ ను కంటిన్యూ చేస్తోంది. బాలీవుడ్ చిత్రాల్లో భారీ చిత్రాలకు కూడా సాధ్యం కాని రన్ ను సొంతం చేసుకుంది.
వీక్ డేస్ లో కూడా ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది ఈ చిత్రం. నిన్న మరో 3.04 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకూ 561.28 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. వీకెండ్ షురూ కావడంతో మరోసారి వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ఆల్ టైమ్ రికార్డు దిశగా అడుగులు వేస్తున్న ఈ హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ లో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ తదితరులు నటించారు. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.