వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తున్న “స్త్రీ – 2”

వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తున్న “స్త్రీ – 2”

Published on Sep 5, 2024 11:30 PM IST

రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హార్రర్ మూవీ స్త్రీ – 2. ఈ చిత్రం 2018 లో రిలీజ్ అయిన స్త్రీ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా అలరిస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తోంది.

బుధవారం రోజున ఈ చిత్రం 5.68 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకూ 520.73 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మద్దోక్ ఫిల్మ్స్ మరియు జస్టిన్ వర్గీసి బ్యానర్ లపై నిర్మించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు