బాక్సాఫీస్ వద్ద “స్త్రీ – 2” సెన్సేషన్ వసూళ్లు!

బాక్సాఫీస్ వద్ద “స్త్రీ – 2” సెన్సేషన్ వసూళ్లు!

Published on Sep 6, 2024 9:39 PM IST


ఆగస్టు 15, 2024 న థియేటర్లలో రిలీజ్ అయిన స్త్రీ – 2 చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా అలరిస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటికీ ఈ చిత్రం స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తూ, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం నిన్న మరో 5.70 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 526.43 కోట్ల రూపాయలు వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 621 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది.

ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు రాబట్టిన చిత్రాల్లో జవాన్ మాత్రమే ఉంది. ఆ రికార్డు దిశగా స్త్రీ – 2 చిత్రం అడుగులు వేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మరియు రాజ్ కుమార్ రావు లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు