మళ్ళీ పెరిగిన “స్త్రీ – 2” వసూళ్లు!


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ స్త్రీ – 2 మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ రన్ ను కొనసాగిస్తుంది. ఈ చిత్రం అధ్బుతమైన వసూళ్లు రాబడుతూ, 600 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకు పోతుంది. ఈ చిత్రం నిన్న మరో 5.55 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో దేశ వ్యాప్తంగా 573.33 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఈ చిత్రం ఇదే జోరును కొనసాగిస్తే, వచ్చే వారాంతంలో 600 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించడం ఖాయం. దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్షక్తి ఖురాణా లు కీలక పాత్రల్లో నటించారు. మద్దోక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version