ఆగస్టు 15న బాక్సాఫీస్ దగ్గర వరుస సినిమాలు రిలీజ్ కావడంతో ప్రేక్షకులు ఏ సినిమాను చూడాలా అనే ఆలోచనలో పడ్డారు. అయితే తెలుగునాట మూడు తెలుగు సినిమాలు ఓ డబ్బింగ్ సినిమా మంచి బజ్‌తో రిలీజ్ అయ్యాయి. ఇక నార్త్‌లో కూడా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ-2’, జాన్ అబ్రహం ‘వేదా’, అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ అనే సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయ్యాయి.
అయితే, వీటిలో శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ-2’ మూవీకి అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గతంలో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్‌గా ఇది రావడం.. హార్రర్ సినిమాలకు అక్కడివారు బాగా కనెక్ట్ అవుతుండటంతో ‘స్త్రీ-2’ చిత్రం సాలిడ్ బుకింగ్స్‌తో దూసుకుపోయింది. దీంతో ఈ సినిమా తొలిరోజు(ప్రీమియర్స్+డే1) ఏకంగా రూ.64.80 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లుగా సినీ ఎక్స్‌పర్ట్స్ తెలిపారు.
హిందీ బెల్ట్‌లో 2024లోనే ఇది హయ్యెస్ట్ తొలిరోజు కలెక్షన్స్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలకంటే కూడా ‘స్త్రీ-2’ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం ఇప్పుడు బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక గట్టి పోటీలో రిలీజ్ అయితేనే, ఇంత కలెక్షన్స్ వచ్చాయంటే.. సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే స్త్రీ-2 విధ్వంసం ఏ రేంజ్‌లో ఉండేదో అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ తదితరులు నటించారు. ఈ సినిమాను అమర్ కౌశిక్ డైరెక్ట్ చేశారు. మున్ముందు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.