“జవాన్”ని కొట్టేసిన “స్త్రీ 2”.. లేటెస్ట్ వసూళ్లతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా

“జవాన్”ని కొట్టేసిన “స్త్రీ 2”.. లేటెస్ట్ వసూళ్లతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా

Published on Sep 18, 2024 3:00 PM IST

ఈ ఏడాదిలో బాలీవుడ్ సినిమా దగ్గర మరీ చెప్పుకోదగ్గ భారీ సినిమాలు లేవు వసూళ్లు రావట్లేదు అనే సమయంలో వచ్చిన రీసెంట్ హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం “స్త్రీ 2” వచ్చి ఒక స్టార్ హీరో సినిమాకి మించిన రేంజ్ లో ఓపెనింగ్స్ సాధించి ఆశ్చర్యపరిచింది. శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) మెయిన్ లీడ్ లో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ చిత్రం బాలీవుడ్ లో అయితే రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది.

ఇలా ఇండియా వైడ్ గా అయితే కొత్త రికార్డులు అందుకున్న ఈ చిత్రం బాలీవుడ్ లో సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన “జవాన్” ని బీట్ చేసి ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియా వైడ్ గా బాలీవుడ్ లో జవాన్ చిత్రం 582 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబడితే దీనిని ఇంకా లాంగ్ రన్ పూర్తి కాకుండానే నిన్న సెప్టెంబర్ 17 వసూళ్లతో 583 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి “స్త్రీ 2” సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో షారుఖ్ లాంటి స్టార్ సినిమాకి ఈ క్రేజీ సీక్వెల్ వెనక్కి నెట్టి అదరగొట్టింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు