స్ట్రాంగ్ బజ్.. మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న సినిమా అదే

స్ట్రాంగ్ బజ్.. మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న సినిమా అదే

Published on Aug 24, 2024 12:00 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గుంటూరు కారం” తో రీజనల్ గా సాలిడ్ వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారీ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సినిమా మొదలు కానుంది. అయితే ఈ సినిమాపై జస్ట్ ఈ రెండు రోజులు నుంచి క్రేజీ అప్డేట్స్ వినిపిస్తున్నాయి.

మేకర్స్ ఆల్రెడీ ఈ సినిమాని ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కానీ అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మహేష్ తో రాజమౌళి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా దాదాపు పదేళ్ల కితమే లాక్ చేయబడిందే అని తెలుస్తుంది. అది కూడా రాజమౌళి మైండ్ లో ఎప్పుడు నుంచో ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గరుడ” నే ఈ సినిమా అన్నట్టుగా టాక్.

అప్పట్లోనే మహేష్ తో ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో అందుకోగా ఇప్పుడు ఫైనల్ గా ఈ అవైటెడ్ కాంబినేషన్ లో అనుకున్నట్టుగా రెడీ కాబోతుంది అని తెలుస్తుంది. మొత్తానికి అయితే మహేష్, రాజమౌళిల సినిమా అనేది ఇప్పుడు పుట్టిందే కాదు ఎప్పుడో పుట్టి ఇప్పుడు కార్యరూపం దాల్చుతుంది అని చెప్పాలి. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎలాంటి సృష్టిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు