NBK 109: “బాలయ్య 109” టైటిల్ రివీల్ అప్పుడే


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీ నెక్స్ట్ లెవెల్ హంగులతో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం విషయంలో టైటిల్ ఏంటి అనేది పెద్ద సస్పెన్స్ గా మొదటి నుంచి ఉండిపోయింది. గతంలో “అఖండ” (Akhanda) కి కూడా ఇంతే రేంజ్ సస్పెన్స్ ని మైంటైన్ చేస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు తన 109వ సినిమాకి కూడా చాలా వరకు టైటిల్ ఏంటి అనే రచ్చే ఎక్కువ నడుస్తుంది. మరి ఈ టైటిల్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటూ పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా టైటిల్ ని ఈ దసరా కానుకగా మేకర్స్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ అక్టోబర్ రెండో వారం లోనే ఈ అవైటెడ్ టైటిల్ ఏంటి అనేది రివీల్ కానుంది అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version