“కల్కి” నుండి ప్రభాస్ – దిశా పటాని ల స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్!

“కల్కి” నుండి ప్రభాస్ – దిశా పటాని ల స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్!

Published on Jun 24, 2024 6:29 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కల్కి భీభత్సం మొదలు కావడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ భైరవ రోల్ లో అందరినీ ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ప్రభాస్ మరియు దిశా పటాని ల స్టన్నింగ్ పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. వీరిద్దరి రొమాన్స్ ఇలా ఉండబోతుందో పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది.

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు