ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు – సుధీర్ బాబు!

ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు – సుధీర్ బాబు!

Published on Sep 13, 2024 2:49 AM IST


టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో, లూజర్ ఫేమ్ డైరెక్టర్ అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రం అక్టోబర్ 11, 2024 న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఈరోజు జరిగిన ఈవెంట్ లో టీజర్ ను లాంఛ్ చేశారు. హీరో నాని డిజిటల్ గా రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మీడియా తో ఇంటరాక్షన్ లో భాగంగా ఒక విలేఖరి మా బావ సూపర్ స్టార్ అనే మాస్ సినిమా తర్వాతకి తీస్తారా అని అడగగా, ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు. సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం అని సుధీర్ తెలిపాడు. ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో మహేష్ ఉన్నాడు అంటూ చేసిన సుధీర్ కామెంట్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.

ఇక మా నాన్న సూపర్ హీరో చిత్రం లో సాయి చంద్, షాయాజీ షిండే, ఆర్న, రాజు సుందరం, శశాంక్, ఆమని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. CAM ఎంటర్టైన్మెంట్ తో కలిసి వీ సెల్యూలాయిడ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి జయ్ క్రిష్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు