“వి” కాకుండా వేరే సినిమా చెప్పమంటున్న సుధీర్ బాబు.!

నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబులు హీరోలుగా నివేతా థామస్, అదితిరావు హైదరీలు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వి” దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన క్రైమ్ రివెంజ్ డ్రామా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ గా ఈ నెల 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో కేవలం కంటెంట్ ను పక్కన పెడితే రీసెంట్ టైమ్స్ లో మన టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో సరికొత్త యాక్షన్ ఎక్స్ పీరియెన్స్ ను ఇచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా సుధీర్ బాబు అయితే ఈ చిత్రంలో స్టన్నింగ్ లుక్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టేసాడు.

అయితే అందులో తన సినిమాను చూసిన సుధీర్ బాబు ఈ లాక్ డౌన్ లో బోర్ కొడుతుంది కాబోలు అది కాకుండా వేరే సినిమాలు ఏమన్నా ఉంటే చెప్పమని తన ఫాలోవర్స్ ను అడుగుతూ పోస్ట్ పెట్టాడు. అందుకు తగ్గట్టుగానే వారు కూడా తమ అభిప్రాయాలూ చెబుతున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు రెండు ప్రాజెక్టులను ఒకే చేసారు. వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా త్వరలోనే తెలుపనున్నారు.

Exit mobile version