దసరా బరిలో సుధీర్ బాబు ఎమోషనల్ డ్రామా..

దసరా బరిలో సుధీర్ బాబు ఎమోషనల్ డ్రామా..

Published on Aug 27, 2024 2:37 PM IST


మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో తన సినిమా సినిమాకి కొత్తగా ట్రై చేస్తూ వస్తున్న నవ దళపతి సుధీర్ బాబు కూడా ఒకరు. మరి రీసెంట్ గా తాను “హరోం హర” సినిమాతో పలకరించాడు. దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారకా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ హిట్ కాలేదు. మరి ఈ సినిమా తర్వాత తన నుంచి మరిన్ని చిత్రాలు ఉండగా కొన్ని రోజులు కితమే మరో సినిమా కూడా అనౌన్స్ అయ్యింది. అయితే ఇది కాకుండా తన నుంచి రాబోతున్న ఇంకో సినిమానే “మా నాన్న సూపర్ హీరో”.

ఓటిటిలో సూపర్ హిట్ అయ్యిన వెబ్ సిరీస్ “లూజర్” దర్శకుడు అభిలాష్ కంకర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై డీసెంట్ బజ్ ఉంది. అయితే ఇప్పుడు మేకర్స్ దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రం ఇపుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఈ చిత్రం రిలీజ్ ని దసరా బరిలో ఉంచుతున్నట్టుగా తెలిపారు. అలాగే రిలీజ్ డేట్ ని అతి త్వరలోనే అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందిస్తుండగా వి సెల్యులాయిడ్, కామ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు