ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హరోం హర”.. కానీ


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు జ్ఞ్యాన సాగర్ ద్వారకా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “హరోం హర”. మరి సుధీర్ బాబు కెరీర్ లో తన వెర్షన్ కేజీయఫ్ తరహా సినిమాగా దీనిని తెరకెక్కించగా డీసెంట్ బజ్ ని అయితే సొంతం చేసుకుంది. కానీ అనుకున్న రేంజ్ లో ఈ సినిమా విజయం సాధించలేదు. అయితే ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి ఇప్పటికే రావాల్సి ఉంది. కానీ యూట్యూబర్ ప్రణీత్ హన్మంత్ ఇష్యూ తో జూలై 18కి వాయిదా పడింది.

కానీ ఈ గ్యాప్ లోనే సినిమా ఒరిజినల్ ప్రింట్ పైరసి బయటకి వచ్చేసి వైరల్ అయ్యింది. అయితే అసలు ఓటిటిలోకి రాకుండా ఇదెలా అయ్యింది అని చాలా మందికి అర్ధం కాలేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సినిమా ఓటిటిలో వచ్చింది కానీ మన దగ్గర కాదు యూఎస్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. అక్కడ కూడా రెంటల్ గా వచ్చింది. ఇలా వచ్చిన ప్రింట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version