కొత్త ఓటిటి డేట్ ని లాక్ చేసుకున్న “హరోం హర”

కొత్త ఓటిటి డేట్ ని లాక్ చేసుకున్న “హరోం హర”

Published on Jul 13, 2024 8:09 AM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవ దళపతి సుధీర్ బాబు హీరోగా మాల్వికా శర్మ హీరోయిన్ గా దర్శకుడు జ్ఞ్యాన సాగా ద్వారకా తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రమే “హరోం హర”. మరి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సుధీర్ బాబు పై సాలిడ్ ఎలివేషన్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బిగ్ స్క్రీన్స్ పై సుధీర్ బాబు గత సినిమాలతో పోలిస్తే బెటర్ గానే పెర్ఫామ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కావాల్సింది కానీ ఆలస్యం అయ్యింది.

ఈ సినిమా హక్కులు రెండు ఓటిటి యాప్స్ ఆహా, ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా ఈ జూలై 11నే రిలీజ్ కి ప్లాన్ చేశారు కానీ ఓ కారణం చేత ఆగిపోయింది. అయితే ఇపుడు ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాని ఈటీవీ విన్ వారు ఈ జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తునట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో స్ట్రేంఇన్గ్ డేట్ ఓ వారానికి వాయిదా పడిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు