మహేష్ ఒక్కరికి మాత్రమే అలా సాధ్యం.!

మహేష్ ఒక్కరికి మాత్రమే అలా సాధ్యం.!

Published on Aug 30, 2020 12:59 PM IST

మన టాలీవుడ్ లో ఉన్న హీరోలలో పాన్ ఇండియన్ అనాలన్నా లేదా హాలీవుడ్ కటౌట్స్ ఎవరన్నా ఉన్నారు అనే టాక్ వస్తే ఖచ్చితంగా అందులో మహేష్ పేరు ఉండాల్సిందే అని చెప్పాలి. కేవలం మన టాలీవుడ్ లోనే ఉండి ఓవర్సీస్ మార్కెట్ లో మహేష్ మహేష్ కలిగించే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.అలాగే మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి గట్టి రెస్పాన్స్ రాబడుతుంది.

అయితే ఇదే మహేష్ కోసం అతని ఇంటి వ్యక్తి మరియు ప్రముఖ టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ మహేష్ పై చేసారు. మహేష్ తో మల్టీ స్టారింగ్ చిత్రం అని కాదు కానీ అతనితో సినిమా చెయ్యాలని మరీ పెద్ద రోల్స్ కాకపోయినా చిన్న రోల్స్ అయినా చేస్తే నాకు చాలని సుధీర్ బాబు తెలిపారు.

మహేష్ తో ఎలా అయినా కనిపించొచ్చు కానీ ఏదన్నా మంచి రోల్ అయితే ఇంకా బాగుంటుందని సుధీర్ బాబు తెలిపారు. అలాగే మహేష్ పై మరో ఆసక్తికర కామెంట్ కూడా చేసారు. సిల్వర్ స్క్రీన్ పై అతి తక్కువ పెర్ఫామెన్స్ తో ఎక్కువ ఇంపాక్ట్ కల్పించగలడని అన్నారు. అలాగే తాము తరుచుగా కూడా కలుస్తుంటామని సుధీర్ బాబు తన లేటెస్ట్ చిత్రం “వి” ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు