ఇంట‌ర్వ్యూ: హ‌రోం హ‌ర‌.. ఆడియెన్స్ కొత్త వ‌ర‌ల్డ్ లోకి వెళ్తారు – సుధీర్ బాబు

ఇంట‌ర్వ్యూ: హ‌రోం హ‌ర‌.. ఆడియెన్స్ కొత్త వ‌ర‌ల్డ్ లోకి వెళ్తారు – సుధీర్ బాబు

Published on Jun 13, 2024 9:01 PM IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ హ‌రోం హ‌ర జూన్ 14న మంచి అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కు రెడీ అయ్యింది. పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో ఈ మూవీపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో సుధీర్ బాబు మీడియాతో ముచ్చ‌టించారు.

హ‌రోం హ‌ర సినిమాను ఒప్పుకోవ‌డానికి కార‌ణం ఏమిటి..?

ద‌ర్శకుడు జ్ఞాన‌సాగ‌ర్ ఈ క‌థ చెప్పిన‌ప్పుడు ఓ స్పార్క్ కనిపించింది. క‌థ‌లో ద‌మ్ముంద‌ని అనిపించింది. సెహ‌రి త‌న క‌థ కాక‌పోయినా, డైరెక్ట‌ర్ దాన్ని పుల్ చేసిన విధానం నాకు న‌చ్చింది. పేపర్ పై ఉన్న‌ది విజువ‌ల్ గా ప్రెజెంట్ చేయ‌డంలో ఆయ‌న ప‌ర్ఫెక్ట్ గా ఉన్నార‌ని.. ఈ క‌థను ఆయ‌న ఇంకా బాగా ప్రెజెంట్ చేయ‌గ‌ల‌ర‌ని అనిపించింది. అందుకే ఓకే చెప్పాను.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది..?

ఈ సినిమాలోని బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్ట‌ర్ హెవీ వెపన్స్, గ్యాడ్జెట్స్ త‌యారు చేస్తుంటే ఆడియెన్స్ క్లాప్స్ కొట్టారు. మ‌న ఊర్లో, ప‌క్కింటి కుర్రాడు గ‌న్స్ త‌యారు చేస్తే ఎలా ఉంటుంద‌నేది ఇందులో నా పాత్ర ద్వారా చూపెట్టాం. జేమ్స్ బాండ్ బ్యాక్ డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు. నా పాత్ర‌కు ఓ డైలాగ్ మ్యాన‌రిజం ఉంది. ‘ఇంక సెప్పెదేమ్ లేదు.. సేసేదే’ అనే డైలాగ్ చాలా చోట్ల వస్తుంది.

ఈ సినిమా ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుంది అని అనుకుంటున్నారు..?

ఈ సినిమా చూస్తూ ఆడియెన్స్ ఓ డిఫ‌రెంట్ వ‌ర‌ల్డ్ లోకి వెళ్తారు. సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ ఉంది. తెలుగులో వచ్చిన టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో హరోం హర కూడా ఉంటుంది. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ సినిమా ఉంటుంది. యాక్ష‌న్ ల‌వ‌ర్స్ కు ఈ మూవీ పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేస్తుంది.

మీరు ప్ర‌తి సినిమాకి లుక్, ఫిజిక్ ని మారుస్తుంటారు. దీని కోసం ఎలాంటి హార్డ్ వ‌ర్క్ చేస్తారు?

ప్ర‌తి సినిమాకు కొత్త‌ ఫిజిక్ ను చూపెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాను. పాత్ర‌లు కూడా కొన్నిసార్లు మోటివేట్ చేస్తాయి. క‌ష్ట‌ప‌డితేనే ఫ‌లితం ద‌క్కుతుంద‌ని నేను న‌మ్ముతాను.

ఇటీవ‌ల చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడారు ?

ఏపీ నూత‌న సీఎం చంద్రబాబు గారికి అభినంద‌న‌లు తెలిపాను. కుప్పం బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాన‌ని గ‌ర్వంగా చెప్పాను. ఆయ‌న ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మీ కెరీర్ లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ.. ఫైనల్ అవుట్ పుట్ చూశాక ఎలా ఫీల్ అయ్యారు..?

ఈ సినిమా ఫైన‌ల్అవుట్ పుట్ చూశాక చాలా శాటిస్ఫై అయ్యాను. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాకు అలా అనిపించ‌లేదు. టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. దర్శకుడికి ఫుల్ మార్కులు వేయొచ్చు.

ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా..?

సినిమా క‌థ‌కి ఆ స్కోప్ ఉంది. అయితే, దీనికి వ‌చ్చే రిజ‌ల్ట్, ఆడియెన్స్ రిక్వెస్ట్ ను బ‌ట్టి ప్లాన్ చేయాలి.

ఈ సినిమాలో మిగ‌తా ఆర్టిస్టుల పాత్ర‌ల గురించి..?

ఈ సినిమాలో సునీల్ స‌స్పెండెడ్ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. ఆయ‌నది ఫుల్ లెంగ్త్ రోల్. చాలా బ‌ల‌మైన పాత్రలో ఆయ‌న కనిపిస్తారు. ఇక మాళ‌విక శ‌ర్మ త‌న పాత్ర కోసం భాష నేర్చుకుని న‌టించింది. చాలా బాగా ప‌ర్ఫార్మ్ చేసింది.

ఈ సినిమా టెక్నిక‌ల్ డిపార్ట్మెంట్ గురించి..?

ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయిన సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ప్రొడ్యూసర్స్ ఎక్క‌డా కూడా కాంప్ర‌మైజ్ అవ‌కుండా గ్రాండ్ గా సినిమాను నిర్మించారు. చేతన్ భరద్వాజ్ మరో అనిరుధ్ లా సెట్ అయిపోతాడు. చేతన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా బలాన్ని ఇస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు