పెళ్లి వీడియో షేర్ చేసిన హీరో

తెలుగు హీరో సుధీర్ బాబు దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరో మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సుధీర్ బాబు తన మార్క్ ఉండేలా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ప్రస్తుతం ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ ను ముమ్మరంగా చేస్తోంది.

కాగా ఇందులో భాగంగా సుధీర్ బాబు తాజాగా తన పెళ్లి వీడియోను చిన్న గ్లింప్స్ గా కట్ చేసి తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. మహేష్ బాబు చెల్లెలు పద్మ ప్రియదర్శితో సుధీర్ బాబు పెళ్లి 2006లో జరిగింది. కాగా సుధీర్ బాబు షేర్ చేసిన పెళ్లి వీడియోలో మహేష్ బాబు కొత్త దంపతులను ఆశీర్వదించడం.. కృష్ణ ఫ్యామిలీ అంతా ఈ వీడియోలో ఉండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అన్నట్టు ఈ వీడియోలో మహేష్ యంగ్ లుక్ లో కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Exit mobile version